Description
సంతృప్తి అనేది నిజమైన కోరిక మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు మీరు సౌకర్యంగా ఉండలేరు. ఎందుకంటే అది మీ సహజ స్థితి కాదు. మీ సహజ స్థితి తలనొప్పి లేని స్థితి. అదే విధంగా మీలో కోరిక కలిగితే, మీరు వెంటనే దానిలోంచి బయటకి రావాలి అనుకుంటారు. ఎందుకంటే లోతైన సంపూర్ణత్వం, సంతృప్తి మీ సహజ లక్షణం. కోరిక మీలోనికి రాగానే మీలో సమతుల్యత పోతుంది. మీరు రెండు ముఖ్యమైన సత్యాలు అర్ధం చేసుకోవాలి. 1. మీ జీవితం అంటే చాలా సంఘటనల గొలుసు. ఇవన్నీ కూడా కేవల ఒక లక్ష్యం వైపు నిర్దేశింపబడి ఉన్నాయి. అది సంతృప్తి. మీరు ఏమి చేసినా, తిన్నా తాగినా, సంబంధ బాంధవ్యాలున్నా ఆస్తి, సంతోషం ఇవన్నీ కూడా ఆ సంతృప్తిని పొందటానికే. దాన్ని డైరెక్ట్‌గా పొందకుండా రకరకాల దారులలో పొందటానికి ప్రయత్నిస్తారు. 2. సంతృప్తి అనేది మీలో ఉంది. అది మీ సహజ లక్షణం. అందుకే అసంతృప్తి నుంచి బయటకి రావటానికి ప్రయత్నిస్తు
సంతృప్తి అనేది నిజమైన కోరిక
